telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

తిమ్మరుసు వచ్చేది ఎప్పుడంటే…?

కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఎంచుకుంటూ త‌నదైన శైలిలో న‌టిస్తూ ప్రేక్ష‌కాభిమానం సొంతం చేసుకుంటున్న స‌త్యదేవ్ త్వరలో కొత్త సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. 47 డేస్ తో పాటు మరికొన్ని సినిమాలను కూడా ఈ లాక్ డౌన్ టైమ్ లోనే సత్యదేవ్ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. ఈ సమయంలోనే మరో కొత్త సినిమాకు సత్యదేవ్ ప్రారంభించాడు. తిమ్మరుసు అనే సినిమాలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు.తిమ్మరుసు టైటిల్ కు అసైన్ మెంట్ వాలి అనేది ట్యాగ్ లైన్. అయితే ఈ సినిమాను మే 21న విడుద‌ల చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై సృజన్‌ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే విభిన్నమైన కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సత్యదేవ్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందట. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘తిమ్మరుసు’ సినిమా చిత్రీకరణంతా పూర్తి చేసుకుందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

Related posts