ఉన్నత పదవులలో ఉండి, ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే వారి సంఖ్య చాలా తక్కువ. అలాంటివారిని అరుదుగా చూస్తాం, అలాగే వారు చేసే పనులు కూడా అంతే స్ఫూర్తిని కూడా ఇస్తాయి. ఐఏఎస్ అనే ఉన్నత బాధ్యతలో ఉండి కూడా.. తన ఇంటిలో శుభకార్యాలకు మితంగా అంటే మితంగా ఖర్చు పెడుతున్నాడు. అదేదో దీపావళి టపాసులు కాదు, తన కొడుకు పెళ్ళికి కేవలం 36 వేలు ఖర్చుచేస్తున్నాడు ఈ ఐఏఎస్. సాధారణంగా ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో వివాహమంటే ఎంతో హడావుడి.. భారీ ఖర్చు ఉంటుంది. కానీ.. విశాఖ మెట్రో ప్రాంతీయ అభివృద్ధి మండలి (వీఎంఆర్‌డీఏ) కమిషనర్ పట్నాల బసంత్‌కుమార్ తీరే వేరు.
గతంలో తన కుమార్తె వివాహాన్ని కేవలం రూ.16,100 వ్యయంతో చేసిన ఆయన తాజాగా కుమారుడి వివాహానికి రూ.36,000 ఖర్చు చేయబోతున్నారు. ఈ నెల 10న విశాఖ నగరంలోని దయాల్‌నగర్‌లో సత్సంగ్ ఆధ్వర్యంలో వివాహం చేయబోతున్నారు. పెళ్లి కుమార్తె తరఫువారు రూ.18 వేలు, పెళ్లి కుమారుడి తరఫువారు రూ.18 వేలు భరించనున్నారు. వివాహం, విందు భోజనాలకు కలిపి ఇదే ఖర్చు. ఈ నెల 8న నూతన వధూవరుల ఆశీర్వాద కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరవుతున్నారు.
నేను ముందే పార్టీకి రాజీనామా చేశా..నన్ను సస్పెండ్ చేయడమేంటి?