telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సింగరేణి గనుల్లో సమ్మె..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

coal singareni

బొగ్గు సంస్థల్లో విదేశీ పెట్టుబడులకు కేంద్రం ఆమోదంపై నిరసన వ్యక్తం చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు సింగరేణి గనుల్లో నేడు ఒక రోజు సమ్మె ప్రారంభమైంది. బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టడంతో పలు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. 28 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో సమ్మె కొనసాగుతోంది.

ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గనుల్లో పూర్తి ప్రభావం కనిపిస్తుండగా, ఉపరితల గనుల్లో పాక్షిక ప్రభావం కనిపిస్తోంది.జాతీయ సంఘాలతోపాటు టీబీజీకేఎస్‌ సమ్మెలో పాల్గొంటున్నాయి. కార్మికుల సమ్మె కారణంగా రామగుండం ఆర్‌బీ 1, 2, 3 రీజియన్‌లోని ఏడుగనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే మందమర్రిలోని భూగర్భ, ఉపరితల గనుల్లో కార్మికులు కూడా సమ్మె బాటపట్టారు. ఈ సమ్మెకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, విప్లవ కార్మిక సంఘాలు మద్దతు పలికాయి

Related posts