telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనాపై భయపడాల్సిన అవసరం లేదు: ప్రధాని మోదీ

narendra-modi

కరోనా వైరస్‌పై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనాను నివారించడానికి చిన్నవైనా, అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని పేర్కొన్నారు.కరోనా నియంత్రణకు వివిధ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.కరోనా వైరస్‌ వ్యాప్తిపై అధికారులతో సమీక్షించానని ట్విట్టర్‌లో ప్రధాని పేర్కొన్నారు.

ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులకు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి.. సరైన వైద్యాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మోదీ స్పష్టం చేశారు. బయటికి వెళ్లినప్పుడు ఇతర వ్యక్తులకు వీలైనంత ఎడంగా ఉండడం వంటి చర్యలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు. జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే వైద్యచికిత్స తీసుకోవాలని సూచించారు.

Related posts