telugu navyamedia
క్రైమ్ వార్తలు విద్యా వార్తలు

బీసీ హాస్టల్ లో .. విషాహారం.. 25మంది అస్వస్థత.. 

Home work panishment Students
రానురాను సంక్షేమ హాస్టల్ లలో నాణ్యత ప్రమాణాలు అడుగంటున్నాయనడానికి ఉదాహరణగా జిల్లాలోని నారాయణపేట లోని బి.సీ.బాలుర హాస్టల్ లో ఫుడ్ ఫాయిజంతో 25 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న ఎమ్మార్వో రాజు,పోలీస్ సిబ్బంది సంఘటనకు గల కారణాలపై వివరాలు సేకరించారు. నిలువ ఉన్న చికెన్ తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సకాలంలో వైద్య సేవలు అందడం తో విద్యార్థులకు ముప్పు తప్పింది. ఘటనపై జిల్లా విద్యాధికారి విచారణకు ఆదేశించారు.
ఇటువంటి సంఘటనలు కొత్తేమి కాకపోయినా, జరిగినప్పుడు కాస్త హడావుడి చేసి అనంతరం సర్దుమణిగిపోతున్నాయి. దీనితో ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. పొరపాటున ఒక్క ప్రాణం పోయినా తీసుకురాలేని వారు, ఇష్టానికి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిపై కఠిన శిక్షలు తీసుకోవాలి అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్లు జైళ్లు కన్నా దారుణంగా ఉన్నాయని వారు విమర్శించారు. ఆహార భద్రత పేరుమీద విద్యార్థులను బలితీసుకునే స్థలాలుగా ఈ హాస్టళ్లు తయారయ్యాయని వారు తీవ్రంగా స్పందించారు. దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, విద్యార్థులకు సరైన ఆహారాన్ని అందించాలని వారు కోరారు.

Related posts