telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీళ్లకు ఏకంగా 50 మంది స్నేక్ హంటర్స్ కావాలట…!?

Snake snared in black widow’s web on Texas family’s patio

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బర్మనీస్ కొండచిలువలు అధిక సంఖ్యలో సంచరిస్తున్నాయి. వీటి వలన మిగతా జీవులకు ఎంతో ప్రమాదం సంభవించి ఉందని అధికారులు చెబుతున్నారు. ఆసియా ఖండానికి చెందిన బర్మనీస్ కొండచిలువలు ఫ్లోరిడాలో ప్రమాదకరంగా మారాయని, రాష్ట్రం నుంచి బర్మనీస్ కొండచిలువలను ఏరివేసేందుకు తాము కంకణం కట్టుకున్నట్టు వైల్డ్ లైఫ్ అధికారులు తెలిపారు. కాగా, తమకు పాములను పట్టి అప్పగించేందుకు 50 మంది హంటర్లు కావాలని.. వారందరికీ గంటకు చొప్పున జీతం చెల్లిస్తామని అన్నారు. నాలుగు అడుగుల కంటే పొడవున్న పాములను పట్టినా, లేదా మరింత ప్రమాదకరమైన పాములను పట్టినా బోనస్ కూడా ఇస్తామన్నారు. 2017లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు, ఇప్పటివరకు 2500కు పైగా కొండచిలువలను వేరే చోటికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే 7.5 లక్షల డాలర్ల ఫండింగ్‌ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కాగా, ఈ ఉద్యోగంలో చేరే వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలని, అన్నీ ఐడీలు, డాక్యుమెంటేషన్ ఆర్డర్‌లో ఉండి.. ఎటువంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదనే నిబంధనలు పెట్టారు.

Related posts