telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆత్మహత్యలు… సింగర్ సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు

Sonu Nigam

బాలీవుడ్ సహా యావత్ సినీ లోకంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నారని, ఆ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజం అంశం హాట్ ఇష్యూగా మారింది. సినీ రంగంలోని ఆధిపత్య ధోరణి ఉందంటూ కొందరు సినీ సెలబ్రిటీలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, సినీ పరిశ్రమలోని ఒత్తిళ్లను బయట పెడుతున్నారు.

తాజాగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు తావిస్తున్నాయి. త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా వరుస ఆత్మహత్యలు చూస్తారని ఆయన పేర్కొనడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కేవలం రెండు కంపెనీలు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నాయని, సినీ రంగం కంటే కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో పెద్ద మాఫియాలు ఉన్నాయంటూ ఆయన చెప్పడం హాట్ టాపిక్ అయింది. నైపుణ్యం ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా మానసికంగా వేధించడం, స్టార్ కిడ్స్‌కే అవకాశాలు ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న ఈ సమయంలో సోను నిగమ్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

Related posts