telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం : ఎల్.రమణ హెచ్చరిక

గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు దేవయ్య దగ్ధం చేసుకున్న పంట పొలంను పరిశీలించి రైతును టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పరామర్శించారు. ఈ సందర్బంగా ఎల్.రమణ మాట్లాడుతూ..ప్రభుత్వం సన్నరకం పంట పండించాలని సూచించారు కాని, అవగాహన కలిగించకపోవడం మూలంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కేంద్ర పథకమైన ఫసల్ భీమాయోజన ప్రీమియంను రాష్ట్రం కట్టకపోవడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఉందని..
అమ్మ పెట్టదు, అడుక్కుని తిననివ్వదు అనే విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అని తెలిపారు ఎల్.రమణ.
రైతుబందు ద్వారా ధనిక రైతులే లబ్ది పొందుతున్నారు తప్ప పేద రైతులకు ఒరిగేదేంలేదని..యుద్దప్రాతిపదికన నష్టం అంచనా వేయడానికి అధికారుల బృందాలను రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు ఎల్. రమణ. ప్రభుత్వం స్పందించకపోతే అన్ని పార్టీలను‌, రైతు సంఘాలను కలుపుకుని ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టైనా రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హెచ్చరించారు.సీఎం కెసిఆర్ ను గద్దె దించే సమయం దగ్గర పడిందని పేర్కొన్నారు ఎల్.రమణ. 

Related posts