telugu navyamedia
రాజకీయ వార్తలు

నాగ్‌పూర్‌లో ఓటేసిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Nitin Gadkari vote Nagpur

మహారాష్ట్ర, హరియాణాలలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతోంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆయన సతీమణి కాంచన్‌ గడ్కరీలు నాగ్‌పూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. బీజేపీ అన్ని రికార్డులను బ్రేక్‌ చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

Related posts