telugu navyamedia
తెలంగాణ వార్తలు

కడుపుమండిన కర్షకుడు…

రైతుకు కడుపుమండింది. కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోడానికి అడుగడుగునా… అగచాట్లు పడాల్సి వస్తోందని ఆవేదనకు అగ్ని తోడైంది… రాజకీయనాయకుల కంటితుడుపు చర్యలు… పాలకులుపరిహాసమాడుతున్నారని కుమిలిపోయిన రైతులు… రోడ్డెక్కారు. కనికరించని అధికారుల వైఖరిని, ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పండించిన ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 25 రోజులు అవుతున్నా, ధాన్యం కొనుగోలు చేయక పోవడంతో రైతులు కాటారం-మంథని ప్రధాన రహదారిపై వడ్లు పోసి నిప్పంటించి,నిరసనలు వ్యక్తం చేశారు. కష్టపడి పంటలు పండిస్తే తీరా అమ్ముకువడానికి కొనుగోలు కేంద్రాలల్లో వస్తే కొనుగోలు జరపకుండా జాప్యం చేస్తూ మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పాడైపోతుంటే… అధికారులెవ్వరూ పట్టించుకోవడంలేదనీ, కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన వడ్లను కొనుగోలుచేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇబ్బందుల్లో ఉన్న రైతుల్లో ఆత్మస్థయిర్యాన్ని పెంపొందించేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పంతానికి పోవడంతో మధ్యలో రైతులు నలిగిపోతున్నారు.

Related posts