telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా వాక్సినేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…

sankranthi holidays in telangana

చైనా నుండి వచ్చి మనల్ని ఏడాదికి పైగా ఇబ్బంది పెట్టిన కరోనా కు ఎట్టకేలకు మందు వచ్చింది. అయితే ఈ నెల 22 నాటికి ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కలందరికి వాక్సినేషన్ పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాత ప్రయివేట్ హెల్త్ కేర్ వర్కర్లకు వాక్సినేషన్ వేయనున్నారు. ఇవాళ 335 సెంటర్లలో వాక్సినేషన్ జరిగింది. ఈరోజు 7 గురికి చిన్న పాటి రియాక్షన్స్ నమోదయ్యాయి. జనగామ.. మేడ్చల్, వికారాబాద్..జిల్లాల్లో రియాక్షన్లు వచ్చాయి. ఈ రోజు 8651 మందికి ఇప్పటి వరకు వాక్సినేషన్ జరిగింది. ఈ నెల 22 నాటికి మొత్తం  ప్రభుత్వ హెల్త్ కేర్  లక్షా 70 వేల మందికి వాక్సినేషన్ పూర్తి చేయాలని రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి సెంటర్లలో వాక్సినేషన్ జరగనుంది. ఇవాళ ఆర్మీలో ఉన్న హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ టీకా వేశారు. మొత్తం 1821 మంది ఆర్మీ హెల్త్ కేర్ వర్కర్లకు వాక్సినేషన్ వేయనున్నారు. ఈరోజు తెలంగాణలో కోవాగ్జిన్ పంపిణీ చేయలేదు. అధికారికంగా రోల్ ఔట్ చేద్దాం అని అనుకున్నారు. తొలి టీకా వేసుకుందాం అనుకున్న డిహెచ్ శ్రీనివాస్ రావు, మంత్రులు కేటీఆర్, ఈటల సమయం కుదరక పోవటం తో మరో రోజు కోవాగ్జిన్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు.చూడాలి మరి ఎనుకున్న విధంగా ప్రభుత్వం చేస్తుందా… లేదా అనేది.

Related posts