telugu navyamedia
తెలంగాణ వార్తలు

కోర్టు వరకూ రావొద్దు.. మధ్యవర్తిత్వంతోనే సమస్యలకు పరిష్కారం..

కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టులకు వచ్చేముందే మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చన్నారు. తద్వారా తక్కువ సమయంలో పరిష్కారాలు లభిస్తాయని చెప్పారు.

మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉంది.. సంప్రదింపులతోనే సమస్యలను పరిష్కరించుకోవాలంటూ కీలక సూచనలు చేశారు.ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని చెప్పారు .విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలని ఎన్వీ రమణ అన్నారు.

ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు మహిళలు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పారు. విస్తృత సంప్రదింపులతో ఇరు పక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం సాధ్యమని తెలిపారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని ఎన్వీ ర‌మ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు.

CJI NV Ramana: 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలిః సీజేఐ ఎన్వీ రమణ

జూన్‌లో సీఎం కేసీఆర్‌తో సెంటర్ గురించి చర్చించినప్పుడు మంచి సహకారం అందించారు.డిసెంబర్ 18 న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు.

అంతర్జాతీయ పారిస్, సింగపూర్, లండన్, హాంగ్‌కాగ్‌లలో ఆర్బిట్రేషన్ సెంటర్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. సింగపూర్, సీజేతో కూడా మాట్లాడాను. వారి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీల సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్‌గా ఉందన్నారు తెలంగాణ ప్రజలు దేన్నైనా స్వాగతిస్తారని సీజేఐ తెలిపారు.

Related posts