telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్‌..

తెలంగాణలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సవరించింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కూడా కొత్త షెడ్యూల్ ప్రకటించింది.

మే 23 నుంచి జూన్ 1 వరకు తెలంగాణ టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, వొకేషనల్, రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థుల కోసం ఈ షెడ్యూల్ ప్రకటించింది.

అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించనున్నారు. జూన్‌ 1వ తేదీన జరిగే ఒకేష‌నల్ కోర్సు (థియ‌రీ) పరీక్ష మాత్రం ఉద‌యం 9.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నారు.

తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఇదే…

మే 23(సోమ‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
మే 24(మంగ‌ళ‌వారం) – సెకండ్ లాంగ్వేజ్
మే 25(బుధ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
మే 26(గురువారం) – గ‌ణితం
మే 27(శుక్ర‌వారం) – భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం
మే 28(శ‌నివారం) – సాంఘిక శాస్త్రం
మే 30(సోమ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
మే 31(మంగ‌ళ‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2
జూన్ 1(బుధ‌వారం) – ఎస్ఎస్సెసీ ఒకేష‌నల్ కోర్సు(థియ‌రీ). ఉద‌యం 9:30 నుంచి 11:30 వ‌ర‌కు

Related posts