telugu navyamedia
తెలంగాణ వార్తలు

కలెక్టర్ ఆరోపణలు పై ఈటెల స‌తీమ‌ణి జమున స్పంద‌న‌..

మెదక్ జిల్లాలో అచ్చం పేట, హకీంపేట గ్రామాల్లో భూ ఆక్రమణ లపై కలెక్టర్ హరీశ్ ఆరోపణలు వాస్తవదూరమని జమున హేచరీస్ అధినేత, హుజురాబాద్ ఎమ్మెల్యే సతీమణి జమున పేర్కొన్నారు.
మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో ఈటెల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు ఆరోపణలపై జమున స్పందించారు.

మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ మీడియా సమావేశాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ అధికారిగా మాట్లాడినట్లు లేదన్నారు. రాజకీయ నాయకుడి తరహాలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు.
వివాదరహిత భూములు ధోరణిలో పొందుపరచామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నోసార్లు పేర్కొన్నారు. అలాంటి భూములే కొనుగోలు చేశామన్నారు.

కలెక్టర్ హరీశ్ పేర్కొన్నవిధంగా 70 ఎకరాలకు మాకెలాంటి సంబంధం లేదన్నారు. తమ కోళ్ల ఫారాలున్న స్థలం 8 ఎకరాల 36సెంట్లని వివరించారు. భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణలు ఉంటే ఇన్నాళ్లు అధికారులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.

భూవివాదం విషయం కోర్టుపరిశీలనలో ఉన్న నేపథ్యంలో కలెక్టర్ హరీశ్ మీడియా సమావేశంలో పేర్కొన్న అంశాలు వాస్తవానికి దూరంగా ఉండటంతో పాటు, కబ్జా ఆరోపణలు మనసును బాధించాయన్నారు.

Related posts