telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

*ఉప రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
*జులై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ..
*ఆగ‌ష్టు 6న ఉపరాష్ట్రపతి పోలీంగ్‌

ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 19 వరకు నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది.

ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే రోజున కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించి ఫలితం కూడా వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది.ఈ నేపథ్యంలో తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు వారసుడిగా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది. ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల కాలంలో అత్యంత సమర్థంగా సేవలందించారు వెంకయ్య. పెద్దల సభ ఛైర్మన్​గా ఆయన హయాంలో రాజ్యసభ పనితీరు ఎన్నడూ లేని విధంగా నమోదైంది.

కాగా..రెండోసారి కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడినే ప్రతిపాదించే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related posts