telugu navyamedia
రాజకీయ

మహారాష్ట్ర సంక్షోభం: ఉద్ధ‌వ్ నేతృత్వంలో మ‌హారాష్ర్ట కేబినేట్ భేటి ప్రారంభం..రేప‌టి బలపరీక్ష అంశంపై చ‌ర్చ‌

*మ‌హారాష్ర్ట కేబినేట్ భేటి ప్రారంభం
*ఉద్ధ‌వ్ నేతృత్వంలో మ‌హారాష్ర్ట కేబినేట్ భేటి
*రేప‌టి ప్లోర్‌టెస్ట్ అంశంపై చ‌ర్చ‌
*గౌహ‌తి నుంచి గోవాకు బ‌య‌లుదేరిన రెబ‌ల్స్‌

మ‌హారాష్ర్ట‌లో రాజ‌కీయాలు క్ష‌ణం క్ష‌ణం మారుతున్నాయి.. రేపు విశ్వాస పరీక్ష నేపథ్యంలో మహారాష్ట్ర కేబినెట్ భేటీకి సీఎం ఉద్ధవ్ థాక్రే నిర్ణయించారు. మరోవైపు శివసేన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది .

ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. సీఎం ఉద్ధ‌వ్ నేతృత్వంలో మ‌హారాష్ర్ట కేబినేట్ భేటి అయ్యింది, రేప‌టి సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాల‌ని చ‌ర్చించ‌నున్నారు.

ఇదిలా ఉండగా రేపు బలపరీక్షను ఎదుర్కోవాలన్న గవర్నర్‌ ఆదేశాన్ని శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఉద్ధవ్ వర్గం.  సుప్రీంకోర్టు విచారణ తర్వాతే రేపు బలపరీక్ష వుంటుందా లేదా అన్న దానిపై క్లారిటీ రానుంది.

అసెంబ్లీలో థాక్రే సర్కార్ తమ మెజారిటీని నిరూపించుకోవాలని రేపు.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు గవర్నర్. గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరగనుంది. 

ఈ ప్రక్రియను ఎట్టి పరిస్ధితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు. నిన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ ను కలిసిన తర్వాత ఈ ఆదేశాలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రోవైపు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతి నుంచి గోవా బ‌య‌లుదేరారు. అక్కడి నుంచి ముంబైకు చేరి నేరుగా అసెంబ్లీకి చేరుకోవాలని ఏక్‌నాథ్‌ షిండే బృందం నిర్ణయించింది.

Related posts