telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా విజృంభణ నేపథ్యంలో బీహార్ సంచలన నిర్ణయం…

Nitish kumar Bihar cm

చైనా నుండి వచ్చిన కరోనా కు మన దేశంలో ఈ ఏడాది నుండి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయిన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలందరికి ఉచితంగా టీకాను అందిస్తామని హామీ ఇచ్చింది.  హామీ ఇచ్చినట్టుగానే బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా టీకాను అందిస్తోంది.  ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగానే టీకాను ప్రభుత్వం అందిస్తోంది.  అయితే, ఇప్పుడు మరొక సంచలన నిర్ణయం తీసుకుంది బీహార్ ప్రభుత్వం.  బీహార్ లోని వైద్యులు, వైద్యసిబ్బంది, పారామెడికల్ సిబ్బందికి సంబంధించి ఎవరూ కూడా ఏప్రిల్ 5 వ తేదీ వరకు సెలవు తీసుకోకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఒకవైపు వ్యాక్సిన్ అందిస్తూనే మరోవైపు కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది బీహార్ ప్రభుత్వం. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts