telugu navyamedia
క్రీడలు వార్తలు

అరుదైన ఘనత సాధించిన రోహిత్ శర్మ…

నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20 లో భరత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 12 పరుగులే చేసిన అరుదైన ఘనతను అందుకున్నాడు. మొత్తం టీ20 ఫార్మాట్‌లో 9 వేల పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. నిన్నటి మ్యాచ్ లో తొలి ఓవర్‌ తొలి బంతినే సిక్స్‌గా మలిచిన రోహిత్‌.. 9 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా తరఫున కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (9,650) ముందు వరుసలో ఉండగా, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (9006) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. వీరి తర్వాత సురేశ్ రైనా (8494) రన్స్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో ఈ రికార్డు సాధించిన ఆటగాళ్లలో రోహిత్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(12) త్వరగానే ఔటైనా.. సూర్యకుమార్ యాదవ్31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57 పరుగులు చేయగా అతనికి తోడుగా రిషభ్ పంత్23 బంతుల్లో 4 ఫోర్లతో 30, శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 37 ధాటిగా ఆడటంతో భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 177 పరుగులు చేసింది.

Related posts