telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు వద్దు : హర్షవర్ధన్

corona vacccine covid-19

మన దేశంలో ఈ ఏడాది ఆరంభం నుండి కరోనా కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. కానీ ఆ వ్యాక్సిన్ విహాయంలో చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు లోక్ సభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.  దేశంలోని రెండు రకాల వ్యాక్సిన్లు సురక్షితమైనవని, అర్హులైన ప్రతి ఒక్కరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని లోక్ సభలో హర్షవర్ధన్ పేర్కొన్నారు.  ఈరోజు దేశంలో 39వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  154 మంది కరోనాతో మృతి చెందారు.  పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది.  రోజుకు 30 లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నారు.  ఈ సంఖ్యను మరింతగా పెంచాలని ప్రభుత్వం చూస్తున్నది.  దేశంలో టీకాకు కొరత లేదని, అదే సమయంలో టీకాలపై వస్తున్న అపోహలను తొలగించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆరోగ్యశాఖ తెలియజేసింది. అయితే కరోనా వ్యాక్సిన్ కారణంగా మొదట్లో కొన్ని మరణాలు సంభవించినందుకే ప్రజల్లో ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Related posts