telugu navyamedia
రాజకీయ

యూపీ సీఎంగా యోగి ప్రమాణస్వీకారం..

*యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం

*రెండోసారి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం

యూపీ​ సీఎంగా యోగి ఆదిత్యనాథ్​ ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన యోగి ఆదిత్యనాథ్​. దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

లఖ్​నవూలోని అటల్​ బిహారీ వాజ్​పేయీ ఇకానా క్రికెట్​ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ సహా పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

మొత్తం 52 మందితో యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో 25 నుంచి 30 మంది వరకు కొత్త వారికి అవకాశం కల్పించారు. కేశవ ప్రసాద మౌర్య, బ్రజేష్ పాఠక్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు.

వీరిలో పాటు కేబినెట్ మంత్రులుగా సురేశ్ కుమార్ ఖన్నా, సూర్య ప్రతాప్ షాహి, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ చౌదరి, జైవీర్ సింగ్, ధర్మపాల్ సింగ్, నంద గోపాల్ నంద, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌బర్, జితేంద్ర ప్రసాద, రాకేశ్ సచాన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ్, అశిశ్ పాటిల్, సంజయ్ నిషద్ ప్రమాణం చేశారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్​ప్రదేశ్​లో భాజపా అఖండ విజయం సాధించింది. మొత్తం 403 స్థానాలకుగానూ ఎన్​డీఏ కూటమి 273 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. భాజపా 255 చోట్ల గెలుపొందింది. అంతేగాకుండా సీఎంగా ఐదేళ్ల కాలం పూర్తి చేసుకుని మరోసారి అధికారంలోకి వచ్చిన తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.

Related posts