telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ఈ జ్యూస్‌లు తాగితే.. ఏ వైరస్ లు సోకవు !

బరువు తగ్గాలనుకుంటున్నారా? జ్యూస్‌లను తీసుకోండి. జ్యూస్‌లను తీసుకోవడం ద్వారా ఆకలి ఉండదని.. తద్వారా ఆహారం మితంగా తీసుకునేందుకు వీలుంటుందని.. దీంతో ఒబిసిటీని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతే కాదు ఈ జ్యూస్ లు తాగితే.. ఎలాంటి వైరస్ లు ఎటాక్ చేయబోవని నిపుణులు అంటున్నారు. 

లెమన్ జ్యూస్:

లెమన్ జ్యూస్‌లో చిటికెడు ఉప్పు, తేనె చేర్చి రోజూ ఉదయం పరగడుపున తీసుకున్నట్లైతే… చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసుకోవచ్చు.

టమోటో జ్యూస్:
ఏడు రోజుల్లో బరువు తగ్గాలనుకుంటే 3 టమోటోలను బాగా ఉడికించి.. మిక్సీలో గ్రైండ్ చేసి బెల్లం చేర్చి మూడు పూటలా తీసుకుంటే బరువు తగ్గుతారు.

అవకోడా జ్యూస్:

అవకోడాను గ్రైండ్ చేసి.. తేనె కలుపుకుని తాగితే పొట్టను తగ్గించుకోవచ్చు. ఇందులోని గుడ్ కొలెస్ట్రాల్.. శరీరంలోకి కెలోరీల శాతాన్ని బర్న్ చేస్తుంది.

గ్రేప్ జ్యూస్:
గ్రేప్ జ్యూస్‌లోని ప్రోటీన్లు, గుడ్ కొలెస్ట్రాల్ ఉండటంతో ఈ జ్యూస్ ద్వారా బరువు తగ్గుతారు.

జామ జ్యూస్:
జామకాయలో విటమిన్ సి అధికంగా ఉండటం ద్వారా వారానికి రెండు సార్లు జామపండుతో చేసిన జ్యూస్ తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే తప్పకుండా బరువు తగ్గుతారు. గోరు వెచ్చని నీటిలో ఆరెంజ్ జ్యూస్‌లో తేనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

అనాసపండు జ్యూస్:
అనాస జ్యూస్‌తో ఆకలి తగ్గిపోతుందని.. అందుచేత సులభంగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts