telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ : .. మళ్ళీ పదిమంది ఐఏఎస్‌ ల .. బదిలీలు..

ap logo

నేడు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 10 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి ఉన్నత అధికారుల బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. అవినీతికి అడ్డుకట్ట వేయాలని కొన్నిసార్లు, గత పార్టీ తొత్తులని కొందరిపై ఈ బదిలీ వేటు పడింది. ఇంకా ఈ బదిలీలు కొనసాగుతాయా.. అనేది చూడాల్సి ఉంది. అయితే ఉన్నత అధికారి నుండి ఎటువంటి ఉద్యోగి అయినా లంచగొండిగా తేలితే .. కఠిన చర్యలు తప్పవని ఏపీసీఎం జగన్ సుస్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే.

అధికారి పేరు – బదిలీ అయిన స్థానం :

కె.రాంగోపాల్‌ – గనుల శాఖ కార్యదర్శి
పి. కోటేశ్వరరావు – విశాఖ మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌
సి. నాగరాణి- యువజన సర్వీసుల శాఖ ఎండీ, ఏపీ స్టెప్‌ ఎండీ
ఎం. హరినారాయణన్‌ – సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌ (ఏపీఐఐసీ ఈడీగా అదనపు బాధ్యతలు)
పి.అరుణ్‌బాబు – పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌
ఎం. విజయ సునీత – సీసీఎల్‌ఏ సంయుక్త కార్యదర్శి
ఎం.ఎన్‌. హరేంధీరప్రసాద్‌ – కాపు కార్పొరేషన్‌ ఎండీ
మహేశ్‌కుమార్‌ రావిరాల – రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌
శ్రీనివాస్‌ శ్రీనరేశ్‌ – పరిశ్రమల శాఖ (హెచ్‌అండ్‌టీ) విభాగం కార్యదర్శి

Related posts