telugu navyamedia
సినిమా వార్తలు

ఆపండి… నా సినిమా గురించి నాకు తెలుసు : “ఆర్ఎక్స్ 100” దర్శకుడు

Ajay-Bhupathi

“ఆర్ఎక్స్100” సినిమాతో ఒక్క‌సారిగా టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. హీరోయిన్‌ను నెగిటివ్ షేడ్‌లో చూపిస్తూ అత్యంత బోల్డ్‌గా తెర‌కెక్కిన ఆ సినిమా అనూహ్యంగా భారీ విజయాన్ని సాధించింది. అయితే అంత‌టి విజ‌య‌వంత‌మైన సినిమాను రూపొందించిన‌ప్ప‌టికీ అజ‌య్ భూప‌తి ఇప్పటివ‌ర‌కు త‌న రెండో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. దీంతో రామ్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని, నాగ‌చైత‌న్యతో ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నార‌ని పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఈ పుకార్లపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయ‌న “నా రెండో సినిమా గురించి చాలా పుకార్లు వ‌స్తున్నాయి. నా రెండో సినిమాను ఎప్పుడు, ఎవ‌రితో, ఎలా తీయాలో నాకు తెలుసు. ఇక‌నైనా ద‌య‌చేసి ఇలాంటి వార్తలను ఆపండి” అంటూ అజ‌య్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు “ఆర్ఎక్స్‌100” హీరో కార్తికేయ న‌వ్వుతున్న ఎమోజీల‌ను పోస్ట్ చేశాడు.

Related posts