telugu navyamedia
సినిమా వార్తలు

వైరల్ పిక్ : అసురన్ గా ధనుష్ లుక్

Asuran

విభిన్నమైన పాత్రలతో సరికొత్త కథలకు ప్రాధాన్యమిస్తూ వరుస సినిమాలతో తమిళనాట మాస్ హీరోగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు ధనుష్. ధనుష్ తన తాజా చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో చేయబోతున్నారు. వి. క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాకు “అసురన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్టులుక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ సినిమాలో మలయాళ నటి మంజు వారియర్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. తమిళ నవల “వెట్కాయ్” ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకి, కలై పులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన ధనుష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూడు నెలల కిందట మొదలైన అసురన్ షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ కి చేరుకుందని తెలుపుతూ సినిమాకు సంబందించిన లుక్ ని విడుదల చేసి స్పష్టం చేశారు ధనుష్. ఈ లుక్ ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

Related posts