telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో నాగశౌర్య కొత్త సినిమా

Nagashourya

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ అన్ని వాయిదా పడ్డాయి. ఇప్పుడు షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈరోజు తన కొత్త సినిమాను అనౌన్స్ చేసాడు యంగ్ హీరో నాగశౌర్య. శౌర్య తర్వాత సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. సుబ్రహ్మణపురం దర్శకత్వం వహించిన సంతోష్ జాగర్లపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నాగ శౌర్య కు జంటగా కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమా యొక్క ప్రీ-లుక్ ఈ రోజు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసాడు శౌర్య. ఈ లుక్ తోనే సినిమా పై అంచనాలు ఏర్పడాయి. 2018 లో వచ్చిన ఛలో సినిమా సూపర్ హిట్ సాధించి హీరో నాగ శౌర్య మార్కెట్ ను అమాంతం పెంచేసింది. ఇక అప్పటినుండి దానిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన కణం, అమ్మమగారిల్లు, నర్తనశాల సినిమాలు నిరాశపరిచాయి. కానీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చి మంచి వసూళ్లు సాధించింది “అశ్వథ్థామ”.

Related posts