telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అభిమాని ఫ్యాన్ మేడ్ వీడియో… స్టార్ హీరో ఫిదా

Ayushman

బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా తాజాగా న‌టించిన “డ్రీమ్ గర్ల్” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. వంద కోట్ల‌కి పైగా వ‌సూళ్ళు రాబ‌ట్టిన ఈ చిత్రం ప్ర‌స్తుతం కొన్ని చోట్ల మంచి క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళుతుంది. పూజా అనే అమ్మాయిగా ఆయుష్మాన్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఆయుష్మాన్ ఇటీవ‌ల “అంధాదున్” చిత్రానికి గాను నేష‌న‌ల్ అవార్డ్ అందుకోగా, ఆయ‌న న‌టించిన విక్కీ డోనార్, ఆర్టిక‌ల్ 15 చిత్రాలు, డ్రీమ్ గార్ల్ చిత్రాలు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాయి. ప్ర‌స్తుతం అమ‌ర్ కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో బాలా అనే సినిమా చేస్తున్న ఆయుష్మాన్ ఖురానా సూజిత్ స‌ర్కార్ ద‌ర్శ‌క‌త్వంలో గులాబో సితాబో, హితేష్ కెవ‌ల్య ద‌ర్శ‌క‌త్వంలో శుభ్ మంగ‌ళ్ జ్యాండ సావ‌ధాన్ అనే చిత్రాలు చేస్తున్నాడు. కాగా… ఆయుష్మాన్ వీరాభిమాని ఒక‌రు ఆయ‌న న‌టించిన ప‌లు పాత్ర‌ల‌కి సంబంధించి యానిమేటెడ్ వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.దీనికి ఫిదా అయినా ఆయుష్మాన్ ఆ వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ అతనికి ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

 

View this post on Instagram

 

Ab tak ki kahaani 🙂 Thank you @prasadbhatart 💛

A post shared by Ayushmann Khurrana (@ayushmannk) on

Related posts