telugu navyamedia
సినిమా వార్తలు

మంచు విష్ణుపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవు. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలి. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబు కు తెలుసు. నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి ఉన్నాయి.

సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అదోగతి పట్టించారు. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారు. మీ వివాదాల్లో తప్పెవరితో మాకు తెలియదు, ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరితో మీకు తెలియదు… నటుడు నాగ బాబు
విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్. 

విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారు. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు అన్నారు.

Related posts