telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లు దొంగ‌ల మూట‌..- సీఎం జగన్ ఘాటు వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ లు ఓ దొంగల ముఠా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఈ ముఠా హైద్రాబాద్ లో ఉంటూ సర్కార్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గురువారం నాడు పల్నాడు జిల్లానర్సరావుపేటలో వాలంటీర్లకు అవార్డులు ఇచ్చారు సీఎం జగన్… ఈ సందర్భంగా టీడీపీ, జనసేనలపై, ఎల్లో మీడియాపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

హైద్రాబాద్ లో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తాము ఇదే రకమైన సంక్షేమ పాలనను కొనసాగిస్తే టీడీపీ, జనసేన బాక్సులు బద్దలౌతాయన్నారు.

తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో తమకు రానున్న రోజుల్లో డిపాజిట్లు కూడా దక్కవనే ఏడుపు ఎల్లో పార్టీలో కనిపిస్తోందన్నారు. ఎల్లో పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీల్లో కూడా కన్పిస్తుందన్నారు. ఈ పార్టీలతో పాటు కూడా ఎల్లో మీడియాలో ఇదే భయం కన్పిస్తుందన్నారు. మంచి చేసే వాడికే దెబ్బలు తగిలినట్టుగానే మంచి చేసే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

ఎన్నికల తర్వాత ప్రజలను మోసం చేసి మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి హైద్రాబాద్ లో దొంగల ముఠా మకాం పెట్టిందని జగన్ ఫైరయ్యారు. మన రైతులు,మన పేదలు, మన పిల్లల్ని ద్వేషించే వారిని మనుషులు అనాలా, మనుషుల రూపంలో ఉన్న దయ్యాలు అనాలో చెప్పాలన్నారు. ఎల్లో మీడియాను మీడియా అనాలా రక్త పిశాచులు అనాలా అని సీఎం అడిగారు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తాను గంటకు పైగా సమావేశమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా జీర్ణించుకోలేదన్నారు .ఢిల్లీ పర్యటనలో మోదీగారు జగన్‌కు క్లాస్‌ పీకారంటూ యెల్లో మీడియాలో కథనాలు వచ్చాయి.. వాళ్లెవరైనా మోడీ సోఫా కిందనో నా సోఫా కిందనో ఉన్నారా? అంటూ సెటైర్లు వేసిన సీఎం.. ఈ రకమైన మాటలు, ద్రుష్పచారం చూస్తుంటే నాకేమనిపిస్తుదంటే అసూయకు మందు లేదు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు.

ఇక, అసూయ పడితే బీపీ లొస్తాయి, గుండె పోటు లొస్తాయి. త్వరగా టికెట్ తీసుకుంటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్.. మరోవైపు, మారీచుడితో యుద్ధం చేస్తున్నాను అంటూ పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించని జగన్.. ఏ పార్టీతో కావాలంటే ఆపార్టీతో కలుస్తారు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోతారు.. చుట్టం వచ్చినట్లు రాష్ట్రానికి వస్తారు.. విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనుకుంటే విడివిడిగా పోటీ చేస్తారని మండిపడ్డారు. తమకిష్టం లేని పార్టీ ప్రభుత్వం ఉంటే కలిసి పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తారని.. గజ దొంగలు ముఠా…‌ అధికారం తప్ప వేరే అజెండా లేదన్నారు..

వీరంతా పైకి వేర్వేరు పార్టీల్లో ఉన్నా అంతా దొంగల ముఠా అని జగన్ ఫైరయ్యారు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని జగన్ వివరించారు . ఎల్లో పార్టీ, అనుబంధ ఎల్లో మీడియా, చంద్రబాబు, ఆయన దత్తపుత్రులు చెప్పే మాటల్ని మాత్రం నమ్మనే నమ్మొద్దంటూ ప్రజలను ఈ సంద‌ర్భంగా సీఎం వైఎస్‌ జగన్ కొరారు.

Related posts