telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేడు గవర్నర్ బిశ్వభూషణ్ తో సీఎం జగన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం జ‌గ‌న్ భేటీ కానున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం వైఎస్ జగన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు.

బుధవారం ఉదయం 9.15 గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. 

AP CM YS Jagan Meets Nitin Gadkari Over - Sakshi

అనంత‌రం ఢిల్లీ పర్యటన ముగియడంతో ఉదయం 9.30 కు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి  సీఎం జగన్ ఏపీకి బయలుదేరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి జగన్ చేరుకుంటారు.. 

బుధవారం సాయంత్రం 6 గంటలకు కు రాజ్ భవన్ లో గవర్నర్‌తో సీఎం కీలక భేటీ కానున్నారు.  కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సంబంధించి గవర్నర్‌కు సీఎం జగన్ వివరించ‌నున్నారు. 

నిజానికి ఈ నెల 8న గవర్నర్‌ను సీఎం కలవాల్సి వుంది. అయితే ముందుగానే పరిణామాలను బిశ్వభూషణ్‌కు తెలియజేయాలని జగన్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 

కాగా…..ఈ నెల 7న (గురువారం) జరగబోయే మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులందరితో రాజీనామా చేయించనున్నారు. ఈ నెల 11 న ఉదయం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ  నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Related posts