*నేడు ముంబైకి కేసీఆర్..
*ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైయి
*కేసీఆర్ వెంట ..ఎమ్మెల్సీ కవిత
*మహారాష్ర్ట సీఎం ఉద్ధవ్ థాక్రేతో మధ్యాహ్నం భేటి..
*కేంద్రప్రభుత్వాలపై ప్రధానంగా చర్చలు
*ముంబై వెలిసిన కేసీఆర్ పోస్టర్లు..
*ముంబై లో సీఎం కేసీఆర్ ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు
*దారి పొడవునా హోర్డింగులు , సైన్ బోర్డులతో ఘన స్వాగతం
*ఎయిర్పోర్ట్ నుంచి ఉద్ధవ్ థాకరే ఇల్లు ” వర్ష ” వరకు అడుగడుగునా భారీ హోర్డింగులు
సీఎం కేసీఆర్ నేడు మహారాష్ట్ర వెళ్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ముంబయి బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో లంచ్ మీటింగ్ లో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను సీఎం కేసీఆర్ కలువనున్నారు. ఇద్దరు నేతలతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చర్చించనున్నారు. తర్వాత సాయంత్రం కేసీఆర్ ముంబయి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ కవిత తో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా వెళ్లనున్నారు.
మరోవైపు ..కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటిలో భాగంగా ముంబయి నగరంలో ‘దేశ్ కా నేత కేసీఆర్’ అనే నినాదంతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.ముంబయి పర్యటనకు ఒక్క రోజు ముందే ముంబయిలోని తెలంగాణ వారు, ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు ఈ భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి, అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.