telugu navyamedia
రాజకీయ

పంజాబ్‌లో ఒకే దశలో.. యూపీలో మూడో దశ కొససాగుతున్న పోలింగ్..

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర​ప్రదేశ్‌లో మూడో దశ,​ పంజాబ్ ​అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ మొదలైంది.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 93 మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

పంజాబ్‌లో ఉదయం 11 గంటల వరకు 17.77 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతుంది. ఈ దశలో 16 జిల్లాల్లోని 59 స్థానాలకు పోలింగ్ జరగుతుంది.. మొత్తం 2.15 కోట్ల మంది ఓటర్లు.. ఎన్నికల బరిలో నిలిచిన 627 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

కాగా.. ఉత్తరప్రదేశ్‌లో మూడో విడతలో 16 జిల్లాల్లో ఉదయం 11 గంటల వరకు సగటున 21.18 శాతం పోలింగ్‌ జరిగింది.

 

Related posts