telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎగ్జిట్ పోల్స్ పై .. ఈసీ కొరడా..

election-commission

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎవరి ఊహలకు అందవు. కొన్ని సంస్థలు ఒక్కో రకంగా చెబుతుంటాయి. ఆ క్రమంలో రెండు మూడు సంస్థల గణాంకాలు దగ్గరగా కనిపిస్తుంటాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాల వెనుక రాజకీయ జోక్యం ఉంటుందనే వాదనలు లేకపోలేదు. ఇక కొన్ని సంస్థలేమో ఆయా పార్టీలకు కొమ్ము కాస్తూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తాయనే వాదనలకు కూడా కొదువ లేదు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఈసీ అధికారులు తీసుకున్న నిర్ణయం హాట్ టాపికైంది. ఈ నెల 21వ తేదీన కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. 17 రాష్ట్రాలకు సంబంధించి 51 అసెంబ్లీ సెగ్మెంట్లలో బై పోల్స్ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు ఎగ్జిట్ పోల్స్‌పై తన నిర్ణయం వెల్లడించింది.

తెలంగాణతో పాటు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, అస్సాం, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, ఛత్తీస్ గఢ్, పుదుచ్చేరి, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే అంశంపై కొరడా ఝలిపించింది. ఎన్నికలు జరగనున్న 21వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధించింది.

Related posts