ఏపీ సీఎం జగన్ ఈరోజు సచివాలయంలో అడుగుపెట్టి పాలన మొదలుపెట్టాలని భావించారు. కొన్ని శాఖలకు సంబంధించి సమీక్షలు నిర్వహించాలని అనుకున్నారు. ముహూర్తం లేకపోవడంతో ఆయన తన నిర్ణయాన్ని చివరి నిముషంలో వాయిదావేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన నివాసం నుంచే పాలన కొనసాగిస్తున్నారు. మంచి ముహూర్తంలో సచివాలయంలో బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా జగన్ ను ఆయన నివాసంలోనే కలుసుకున్నారు.
అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా సీఎంతో సమావేశం కాబోతున్నారు. ఆర్థిక పరిస్థితి, ఆయా శాఖల స్థితిగతులపై జగన్ సమీక్ష జరపనున్నారు.అటు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా జగన్‌తో భేటీ కాబోతున్నారు. అధికారుల బదిలీలు, రాష్ట్ర పరిస్థితిపై మరోసారి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే సీఎంవోలోని ఉన్నతాధికారులను నిన్న బదిలీ చేసిన విషయం తెలిసిందే. నేడో, రేపో మరికొందరు అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఏపీ మ్యాప్ లో అమరావతి లేకపోవడానికి వైసీపీనే కారణం: యనమల