telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు సీఎం జగన్ దే…

ఆంధ్రప్రదేశ్ లో భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్ కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాక్ పోలింగ్ తర్వాత వరసగా వచ్చి తమ ఓటును వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏకపక్షంగా పోలింగ్ జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అధికార వైసీపీ మద్దతు ప్రకటించింది. 151 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అలాగే విపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపింది. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు తెలపడతంతో ఏపీలో రాష్ట్రపతి ఎన్నిక ఏకపక్షమైంది.

Related posts