హోంగార్డులకు బీమా సౌకర్యం వర్తిస్తుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డులకు బీమా సౌకర్యం కల్పించేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకు రావడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల మంది హోంగార్డులు, 72వేల మంది పోలీసులకు బీమా వర్తిస్తుందని తెలిపారు.
ప్రమాదంలో మరణించిన హోంగార్డులకు రూ.40 లక్షల బీమా వర్తిస్తుందని వెల్లడించారు. పూర్తిగా అంగ వైకల్యం కలిగితే రూ.30 లక్షలు బీమా వర్తిస్తుందని చెప్పారు. పోలీసుల ఆరోగ్య భద్రతలో హోంగార్డులను కూడా భాగస్వాములను చేసేందుకు ఆలోచన చేస్తామని డీజీపీ తెలిపారు.