telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహానాడు 2021 : టిడిపితో నూతన చరిత్ర

chandrababu tdp ap

స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను సమీక్షించుకోవడం, భవిష్యత్ కార్యక్రమాలకు ఒక మార్గ నిర్దేశనం చేసుకోవడం ఆనవాయితీ. మహోత్సవంలా జరగాల్సిన మహానాడును కరోనా నేపథ్యంలో ఈసారి కూడా డిజిటల్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించారు. మే 27, 28 తేదీలలో ఆన్ లైన్లో ‘డిజిటల్ మహానాడు 2021’లో నిర్వహిస్తోంది టిడిపి. ఇందులో భాగంగానే కాసేపటి క్రితమే మహానాడు ప్రారంభం అయింది. ఈ సందర్భంగా నారా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందన్నారు. మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టినరోజని, ఎన్టీఆర్‌ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రపంచంలోని ఏ మూలన చూసినా తెలుగువారు ఉన్నారన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సమాజహితం టీడీపీ ధ్యేయమని అన్నారు. కోవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయని, కరోనాను ఎదుర్కొంటూ పోరాడాలని చంద్రబాబు పిలుపుఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వం సరైన రీతిలో ప్రజల్ని ఆదుకునే చర్యలు తీసుకోలేదని చంద్రబాబు విమర్శించారు. ఆక్సిజన్ లేక, మందులు కొనలేక ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసి పని చేద్దామని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నా బాధ్యత లేకుండా వ్యవహరించారని విమర్శించారు. సలహాలు, సూచనలను ఎగతాళి చేసి పారాసిట్‌మాల్, బ్లీచింగ్‌తో పోతుందని మాట్లాడారన్నారు. కరోనాతో సహజీవనం చేయాలంటూ.. ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని మండిపడ్డారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చనిపోయిన వారి సంఖ్యను దాచిపెట్టి అవాస్తవాలు చెప్పారన్నారు. మానవ హక్కుల సంఘం విచారణ చేపడితే 23మందికి పరిహారం ఇస్తామని లెక్క మార్చారన్నారు. ఆనందయ్య వైద్యంపైనా నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆనందయ్య వైద్యంపై తప్పు చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా పరామర్శించే టీడీపీ నేతలపై చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా తోచిన సాయం చేస్తూ 4 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు శ్రీకారం చుట్టామన్నారు.

Related posts