రీసెంట్‌గా మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ హ్యాండిల్స్‌పై ఓ ట్రెండ్ సెట్ చేశారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. #HappyBirthdyaMaheshBabu అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ చేస్తూ 60.2 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డు నెలకొల్పారు. దీంతో ఆ రికార్డులు సవాల్‌గా స్వీకరించి రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #PawanKalyan BirthdayCDP హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లోనే 65 మిలియన్ల ట్వీట్స్ చేసి సరికొత్త వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే రాబోతోంది. ఈ సందర్భంగా #PawanKalyan BirthdayCDP హ్యాష్ ట్యాగ్‌తో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా హంగామా షురూ చేశారు. ఇకపోతే ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత సినిమాలు వదిలేసి.. రెండేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ చేస్తున్న ఆయన ఆ తర్వాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు.
previous post
next post
“జబర్దస్త్”ను వీడే ప్రసక్తే లేదు : నాగబాబు