telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

ఈ నెల నుంచి పింఛను రూ.2 వేలు: చంద్రబాబు

Chandrababu Comments Jagan KCR
ఏపీ లో ఈ నెల నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్ లను ఇవ్వనుంది. పింఛను మొత్తాన్ని రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల నుంచే దీన్ని అమలు చేస్తామన్నారు. అయితే ఈనెల మిగిలిన రూ.వెయ్యిని కలిపి ఫిబ్రవరిలో రూ.మూడు వేలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నుంచి నెలకు రూ.రెండు వేలు చొప్పున పింఛన్‌ అందుతుందని వివరించారు.
జన్మభూమి – మాఊరు 6వ విడత ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో నిర్వహించారు.ఈ సందర్భంగా  సీఎం మాట్లాడుతూ పింఛన్ల ద్వారా 54 లక్షల మందికి మేలు జరుగుతోందని చెప్పారు. విద్యార్థినుల కోసం రక్ష పథకం పేరుతో రేషన్‌ షాపుల ద్వారా శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ చేస్తామని తెలిపారు. 
రుణమాఫీ మిగిలిన మొత్తాన్ని 10 శాతం వడ్డీతో ఈనెలలోనే విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్‌ నుంచి ఎన్టీఆర్‌ వైద్య సేవ పరిధిని రూ. 5 లక్షలకు పెంచుతామన్నారు. పోలవరం ద్వారా గ్రావిటీతో  మే నెలలో నీటిని విడుదల చేసి డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

Related posts