telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నిర‌స‌న దీక్షలో చంద్రబాబు నాయుడు స్పీచ్ హైలెట్స్‌..

ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు
మీకు చిత్తశుద్ధి వుంటే డ్రగ్స్ అరికట్టండి
మాపై కాదు మీ ప్రతాపం.. హెరాయిన్, డ్రగ్స్, గంజాయి వాడే వారి మీద చూపండి
జగన్ లాంటి విభిన్నమైన వ్యక్తిని సరిచేసే శక్తి టీడీపీకే వుంది
సమాజం సర్వనాశనం అయ్యాక పదువులు ఉంటే ఎంత లేకుంటే ఎంత?
ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్

టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు మాట్లాడుతూ.. నిరసన దీక్ష ఎన్టీఆర్ భవన్ లో చేయడం ప్రత్యేకమైన పరిస్థితి. వచ్చిన సమస్య పట్ల ప్రజల్ని చైతన్యంవంతం చేయడం గానీ, ప్రజలకు న్యాయం చేయడానికి అనేక విధాలుగా పోరాటం చేస్తాం. అందులో నిరాహార దీక్ష, ధర్నాలు చేస్తుంటాం.

కానీ నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో దాడి జరిగిన చోట నుండే నిరసన దీక్ష చేస్తున్నాం. 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న కార్యాలయం ఇది. తెలుగు ప్రజలకు పవిత్రమైన దేవాలయం. అలాంటి దేవాలయం మీద, కార్యకర్తల మనోభావాల మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం. దేశ చరిత్రలో, నా 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో పార్టీ కార్యాలయాలపై ఇలాంటి దాడులు చూడలేదు. జరగరాని సంఘటనలు జరిగినప్పుడు ఆవేశంలో చిన్నవి జరగవచ్చుకానీ, ఒక పద్ధతిగా టీడీపీని తుదిముట్టించాలి, భయబ్రాంతులను చేయాలి, ఎవరైనా టీడీపీలో వుండాలన్నా, ప్రతిపక్షాలు మాట్లాడాలన్నా భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ దాడులు చేస్తున్నారు. ఈ దాడులపైన పెద్ద కుట్రే జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడే వుంది. వైసీపీ వాళ్లు వచ్చినప్పుడు మేము వర్చువల్ మీటింగ్ లో ఉన్నాం. అప్పుడే 4.30 గంటలకు పట్టాభి ఇంటిపై దాడి జరిగిందని సమాచారం వచ్చింది.

పట్టాభి భార్యను, 8 ఏళ్ల చిన్న అమ్మాయిని కాపాడాలని ఆలోచిస్తున్నాం, ఆలోపే ఇళ్లు మొత్తం ధ్వంసం చేశారు. మామాలుగా ఆవేశం వుంటే..రాయి వేసి, ఒక దెబ్బ కొడతాం. కానీ చిన్నపిల్ల వుంటే వారి మనోభావాలు ఆలోచించకుండా దాడి చేశారంటే వారి మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి. పెద్దయ్యాక అదే మనోభావాలు గుర్తుంటాయి. వెంటనే డీసీపీ, డీజీపీకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ అప్పుడే.. డీజీపీ కార్యాలయం పక్కన, సీకే కన్వెన్షన్ నుండి 150 మంది పార్టీ కార్యాలయానికి బయలు దేరారని సమాచారం అందింది. వెంటనే 5.03 నిమిషాలకు డీజీపీకి ఫోన్ చేశాను. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, ప్రతిపక్ష నేతల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. నేను ఫోన్ చేస్తే పనులున్నాయని డీజీపీ ఫోన్ తీయలేదు. పక్కన వుండే అర్బన్ ఎస్పీకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. సీఐకి, డీఎస్పీకి మా కార్యాలయ సిబ్బంది ఫోన్ చేస్తే ఏం జరగుతుంది, మీకెలా తెలుసు అని మాట్లాడే పరిస్థితి వుంది. నేను వెంటనే గవర్నర్ కు ఫోన్ చేశాను.

విశాఖ పార్టీ ఆఫీసుపై దాడి చేశారు, హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసంపై దాడి చేశారు. కడపలో అమీర్ బాబు ఇంటిపై, లింగారెడ్డి ఇంటిపై దాడి చేయడానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఇంచార్జి సుధీర్ రెడ్డి రేణిగుంట్లలో వుంటే ఆయన కారు పగలగొట్టారు..ఇవన్నీ గవర్నర్ కు చెప్పాను. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.. టీడీపీ నేతలను, కార్యాకర్తలను చంపాలని చూస్తున్నారు, గవర్నర్ గా మీకు అధికారం వుంది, వాటిని అరికట్టండని చెప్పాం. కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశాను. వంద మీటర్ల దూరంలో మా పార్టీ కార్యాలయానికి డీజీపీ ఆఫీస్ వుంది. బెటాలియన్ వుంది. పక్కన సీఎం ఇళ్లు వుంది. కానీ టీడీపీ కార్యాయలంపై దాడి జరిగింది. పోలీసులు, వైసీపీ గూండాలు కలిసి ఈ దాడి చేశారు

కేంద్రమంత్రిగా మీరు జోక్యం చేసుకోండి, దేశంలో ఈ రాష్ట్రం భాగం, బాద్యత తీసుకోండని చెప్పాను. తక్షణమే చర్యలు తీసుకుంటాం..లేఖ పంపండని చెప్పారు. దాడి ఘటనలు చూస్తుంటే మనసంతా ఈ ఆఫీసుపైనే వుంది. 70 లక్షల మంది కార్యాకర్తలు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలయం ఈ పార్టీ కార్యాలయం. ఈ దాడి మనపై కాదు..ప్రజాస్వామ్యంపై దాడి. ఏదైనా పర్వాలేదు..తాడోపేడో తేల్చుకోవాలని వెంటనే కార్యాలయానికి వచ్చాను. పట్టపగలు, డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న కార్యాలయంపై దాడి చేశారు. వైసీపీ గూండాలు నేరుగా ఈ డీజీపీ ఆఫీసు ముందు నుండే వచ్చారు. మన గేటును కారుతో కొట్టి పడగొట్టారు. వున్న వాళ్లను సుత్తెలతో విచక్షణా రహితంగా కొట్టారు. తాగి వచ్చి వీరంగం సృష్టించి, కర్రలు, రాడ్లు, రాళ్లతో అద్దాలు పగలగొట్టారు. తర్వాత తీక్షణంగా పోలీసులు వచ్చి వాళ్లను సాగనంపారు. మీకు సిగ్గనిపించలేదా డీజీపీ, పోలీసులు.? మమ్మల్ని మేము కాపాడుకోవాలి.

వైసీపీకి సవాల్ విసురుతున్నా..మమ్మల్ని మేము కాపాడుకోగలం.. పోలీసులకు చేతగాకపోతే స్టేషన్లు మూసేసుకుని వెళ్లండి. నేను ముఖ్యమంత్రిగా చేశా, 22 ఏళ్లు టీడీపీ అధికారంలో వుంది, సామాన్య ప్రజలు, ప్రతిపక్షం ఎవరికి ఆపద వచ్చినా కాపాడిన ఏకైక పార్టీ టీడీపీ. జగన్ రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేశారు, డీజీపీ రాజ్యాంగంపై ప్రమాణస్వీకారం చేసి పదవి స్వీకరించారు. ఇంత విధ్వంసం జరిగితే మీరు ఏం చేశారు.? ఇప్పటి వరకు నా మంచి తనాన్ని చూశారు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా..ఖబడ్దార్. జగన్ ను హెచ్చరిస్తున్నా. రాష్ట్రలో శాంతి భద్రతలు పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. అలాంటప్పుడు 356 పెడతారు. టీడీపీ ఎప్పుడూ రాష్ట్రపతి పాలన కావాలని అడగలేదు.

ఒక పార్టీ కార్యాలయంపైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యవస్థపైన పద్దతి ప్రకారం చేశారు. అందుకే రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయి, 356 పెట్టి రాష్ట్రాన్ని కాపాడాలని కోరాను. ఎన్ని గట్స్ వుండాలి డీజీపీకి.? కార్యాలయానికి ఎవరో సీఐ వచ్చి అనుమానస్పదంగా తిరిగితే పట్టుకుని మీడియా ముందు మనవాళ్లు పెట్టారు. పోలీసులకు అప్పజెప్పిన తర్వాత అతనెల్లి మన నాయకులపై హత్యాయత్నం కేసు పెట్టారు. మా అనుమతి లేకుండా మీ అధికారి మా ఆఫీసుకు ఎందుకు వచ్చారు. మహావ్యవస్థకు ఈ డీజీపీ నాంది పలికారు..శబాష్. ఎన్ని చేస్తారో చేయండి చూస్తాం. పట్టాభి వాడిని బాష తప్పైతే సీఎం భాష ఏంటి.? మీ మంత్రులు మాట్లాడిన భాష ఏంటి.? ప్రజల్ని అడుగుదామా.? విలువలతో కూడిన రాజకీయం చేశాము.

మీ ఇష్ట ప్రకారం ఏకపక్షంగా తిడుతూ దాడులు చేస్తూ కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రలో రెండున్నరేళ్లుగా సహజవనరులు ఏకపక్షంగా పోయాయి. మైనింగ్ హస్తగతం చేసుకున్నారు. లిక్కర్ చూస్తే నాసిరకం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయి. తాగితే చనిపోతున్నారు. సొంత బ్రాండ్లు తయారు చేసి కమీషన్లకోసం అమ్ముతున్నారు. జగనే షాపులు పెట్టుకుని జగనే అమ్ముకుంటున్నారు. ఇసుక ఎక్కడా దొరకడం లేదు. పేదల రక్తాన్ని తాగుతున్నారు. పన్నులు విపరీతంగా పెంచారు. రైతులకు గిట్టుబాటు దర లేదు. కరెంటు చార్జీలు పెంచారు. రాష్ట్రం ఏమైపోతుందోనని భయం వేస్తోంది. జగన్ చేసే తప్పులు, రాష్ట్రం అదోగతి పాలు చేసేలా వుంది. ఎక్కడ చూసిన నాసిరకం లిక్కర్. మరోవైపు వాళ్లే నాటుసారా తయారు చేస్తున్నారు. అవి తాగి జనం ప్రాణాలు పోగొట్టుకున్నారు.

రాష్ట్రంలో గంజాయి విపరీతంగా పెరిగింది. రూ.25వేల ఎకరాల్లో గంజాయి పండించి వ్యాపారం చేస్తున్నారు. ఎక్కడ గంజాయి దొరికినా దానికి మూలం ఏపీ. పక్క రాష్ట్ర సీపీ ఏపీ నుండి గంజాయి వస్తుందని చెప్పారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తామని కేసీఆర్ అన్నారు. జగన్ ఒక్క మీటింగ్ అయినా పెట్టారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడితే నర్సీపట్నం నుండి వచ్చి నోటీసులు వచ్చారు. పేపర్లలో సమాచారం వస్తుంది, క్షేత్ర స్థాయి నుండి సమాచారం వస్తుంది. వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపడటానికి మనం ప్రయత్నిస్తే మనకు నోటీసులు ఇస్తున్నారు. పలానా దిక్కున చంపారు అంటే మీకు సమాచారం వుందా అని అడుగుతున్నారు..మేము మీకు సాక్ష్యాలు ఇవ్వాలా.? ముంద్రా పోర్టులో హెరాయిన్ 3 వేల కేజీలు దొరికింది. దాని చిరునామాలు విజయవాడలో అని వచ్చింది. దానిపై మాకు సంబంధంలేదని సీపీ మాట్లాడుతున్నారు. సత్యనారాయణ పురం మీరు వెళ్లారా..జీఎస్టీ ఎందుకు కడుతున్నారు. కేసులు పెడతామని డీజీపీ అన్నారు..మీకేసుకులకు మేము భయపడం.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి 1984 లో ఎన్టీఆర్ ను సీఎంగా బర్తరఫ్ చేస్తే ప్రాణాలకు తెగించి రోడ్ల మీదకు వచ్చి పోరాడి 30 రోజుల్లో ఎన్టీఆర్ ను మళ్లీ సీఎం ను చేసుకున్న చరిత్ర ఈ తెలుగుజాతిది. ఈ డీజీపీ నాకు నీతులు, కథలు నేర్పిస్తాడా.? అధికారం వస్తే అహంభావంతో ఊగిపోతారా.? ఈ రాష్ట్రంలో డ్రగ్స్ లేవా.? డ్రగ్స్ పై అందరినీ సంప్రదించి అరికట్టాలని మాట్లాడటం లేదు. గంజాయి తాగావ వారి జీవితంలో మామూలు మనుషులు కాలేదు. దీనిపై టీడీపీ పోరాడితే మా నోర్లు మూయడానికి మా కార్యాలయంపై దాడి చేస్తారా.? సీఎం, డీజీపీని హెచ్చరిస్తున్నా..మీరు చేసింది చాలా తప్పు. అది సరిచేసుకోలేనంతంగా వుంది. మీకు ఎలాంటిచిత్తశుద్ధి వున్నా డ్రగ్స్ అరికట్టండి.

మాపై కాదు మీ ప్రతాపం.. హెరాయిన్, డ్రగ్స్, గంజాయి వాడే వారి మీద మీ ఉక్కు పాదం మోపండి. పోరాడేవాళ్లను అణచాలని చూస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇది ప్రభుత్వ ఉగ్రవాదమే. వీళ్ల చేసిన అరాచకంపై పోరాడటానికి సమావేశం. కార్యాలయంపై దాడి చేస్తే కార్యాలయానికి రావడానికి భయపడతారని, నాయకులను అరెస్ట్ చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు. వైసీపీ ఎంపీ రఘురామను కొట్టి మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. కోర్టుల మీద పోస్టులు పెట్టి కామెంట్లు చేశారు. మాస్కు అడిగిన దళిత డాక్టర్ ను చేతులు విరిచి చంపారు. ఇది టీడీపీ వైసీపీకి మద్య జరిగే యుద్ధం కాదు. ప్రజల సమస్యల మీద పోరాటం చేసే వ్యవస్థ మీద జరిగిన దాడి. టీడీపీ, వైసీపీకి ఆస్తులు, దాయాదలు సమస్యలు లేవు. ఈ రోజు మేము చేసిన పోరాటం మాకోసం కాదు. డ్రగ్స్ వల్ల జాతి నిర్వీర్యం అయిపోతుంది. రూ.1.72 లక్షల కోట్లు తాలిబన్లకు వెళ్లింది. సంఘ విద్రోహశక్తులకు డబ్బులు వెళ్తున్నాయి. రోడ్లు వేయలేదు. పన్నలు పెంచారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది. అప్పులు పాలైంది. పిల్లల భవిష్యత్ కోసం బతికుతున్నారు. వారి భవిష్యత్ పాడైపోతోంది. అదే నా ఆవేదన. డ్రగ్స్ వ్యాపారం చేసిన వాళ్లను పట్టుకోమంటే మాపై కేసులు పెడుతున్నారు.

భావి తరాల భవిష్యత్, ప్రజల భవిష్యత్ కోసం మీరు ఆలోచిస్తే వెంటనే మీరు చేయాల్సింది..డ్రగ్స్ ను నివారించాలి. కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం..రాష్ట్రాన్ని అడ్డాగా చేసుకుని గంజాయి, డ్రగ్స్ ను తెస్తే అది ఏపీకే పరిమితం కావడం లేదు. హైదరాబాద్, యూపీ, కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలకు తరలి వెల్లింది. డ్రగ్స్ నియంత్రించే వరకు వదిలిపెట్టే పరిస్థితి లేదు. జగన్ విభిన్నమైన వ్యక్తి. అలాంటి వాళ్లను సరిచేసే శక్తి టీడీపీకి వుంది. వైసీపీ నాయకులు పదవులు, పోలీసులు పోస్టింగుల కోసం ఆశించవద్దు. మీ పిల్లల భవిష్యత్ పాడైపోతోంది. సమాజం సర్వనాశనం అయ్యాక పదువులు ఉంటే ఎంత లేకుంటే ఎంత.? ఉంటే ఇంకో రెండేళ్లు వుంటారు. ఇంత వరకు నా మంచితనాన్ని, మా పార్టీ మంచి తనాన్ని చూశారు. భవిష్యత్ లో మీరు చేసే చెడు పనులకు మీకు శిక్ష పడేవరకు వదిలిపెట్టను. చట్టం చుట్టం కావడానికి వీళ్లేదు. పెట్టేది తప్పుడు కేసులు, మావారినే జైలుకు పంపుతున్నారు. ఏదో కుట్ర జరగుతుందని వైసీపీ వాళ్లే అంటున్నారు. కులాల మద్య వైసీపీ వాల్లే చిచ్చుపెడుతున్నారు.

ఎప్పుడైనా దేవాలయాలు, చర్చీలు, మసీదుల మీద దాడులు జరిగాయా.? ప్రజలు అప్రమత్తంగా వుండి మనల్ని మనం కాపాడుకోవాలి. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. రెండున్నరేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. కార్యకర్తలు చూపిన తెగువకు శిరస వంచి నమస్కరిస్తున్నారు. ఈ రోజు పోలీస్ సంస్మరణ దినోత్సవం. ఈ మంచి రోజు ఈ కార్యక్రమం పెట్టాం. పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని మనం చిత్తశుద్ధిగా నిర్వహించాం. వారి త్యాగాలను ఒకసారి నెమరువేసుకున్నాం. నాడు సమాజం కోసం పోరాడారు. యుద్దాల్లో సంఘవిద్రోహక శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు. ఇప్పటి పోలీసులను చూస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. వ్యవస్థను నేను ఏమీ అనను.

రాజ్యాంగం గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యక్తి మంచి వాడు కాకపోతే దాని ఫలితం మారుతుందని అంబేద్కర్ చెప్పారు. ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. అదే పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారు. తీవ్రవాద, ముఠానాయకులు, మత విద్వేశ శక్తులు, సంఘవిద్రోహ శక్తులపైన పోలీసులు పోరాడారు. కానీ ఇప్పుడు సమాజ హితం కోసం పోరాడే వారిపై అక్రమంగా చర్యలు తీసుకుంటున్నారు. అధికారం శాశ్వతం కాదు..త్యాగాలు శాశ్వతం. చట్టాలు గౌరవిస్తే శాశ్వతంగా మంచి పేరు వుంటుంది. డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన రావాలి. స్టేట్ టెర్రరిజాన్ని సమర్థవంతంగా ఎదుర్కొందాం.ప్రజలు ఆలోచించాలని కోరుతున్నా. ఎవరి హద్దులో వారు వుండేలా పోరాటం చేయాలి. అందరికీ అండగా వుంటా. అందరం కలిసి ముందుకువెళ్దాం. ఇది ఏపీ సమస్య కాదు..దేశ సమస్య.

Related posts