telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ‌లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఎగ్జామ్స్..ఎప్పుడంటే..

తెలంగాణ స్టేట్‌ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల అడ్మిట్‌ కార్డులు విడుదల చేసింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ పరీక్షలు ఈనెల 25 నుంచి నవంబర్‌ 2 వరకు జ‌ర‌గ‌నుంది.

ఈ నేప‌ధ్యంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదని ఇంటర్‌ బోర్డ్‌ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు తేలికగానే ఉంటాయని, కరోనా నేపథ్యం, విద్యాబోధనలో ఇబ్బందులు, కొన్నిచోట్ల సిలబస్‌ పూర్తవ్వని పరిస్థితులను ప్రశ్నాపత్రం రూపకల్పనలో కీలకాంశాలుగా తీసుకున్నట్టు చెబుతున్నారు. బోర్డు విడుదల చేసిన స్టడీ మెటీరియల్‌ పరిధిలోనే ప్రశ్నలుండే వీలుందంటుని బోర్డు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ప‌రీక్ష నిబంధ‌న‌లు..
పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం వరకు జరుగుతాయని…పరీక్షా కేంద్రానికి వచ్చేటప్పుడు విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్‌ కార్డులు తెచ్చకోవాలని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. అదేవిధంగా కొవిడ్‌ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా మాస్కులు కచ్చితంగా ధరించాలని తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో కూడా శానిటైజర్‌, విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

manabdi, manabadi ts inter hall ticket, TS Inter admit card, TS first year inter admit card, TS inter first year exams, TS Inter exams, TS Inter admit card 2021

హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి ఇలా..
ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ కు వెళ్లాలి.
ఆ తర్వాత TSBIE IPE 2021 First Year Hall Tickets అనే లింక్(General/vacational) పై క్లిక్ చేయాలి.
క్లిక్ చేయ‌గానే https://tsbieht.cgg.gov.in/IPE2021FirstYrHallTickets.do లింక్ ఓపెన్ అవుతుంది.
అందులో అవ‌స‌ర‌మైన డీటైల్స్ రిజిస్టర్ చేసి స‌బ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
ఆ తర్వాత హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.

Related posts