గ్రీన్ ఫీల్డ్ రాజధానుల్లో అమరావతి ఒకటని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అది రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ స్థాయిని పెంచడమేకాక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బలోపేతం చేస్తుందన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ పోరాడుతున్న జేఏసీ కి ఛైర్మన్ గా నియామకమైన జీవీఆర్ శాస్త్రికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్టర్లో సందేశాన్ని పోస్ట్ చేస్తూ..జీవీఆర్ శాస్త్రి సరైన దిశలో ఉద్యమాన్ని తీసుకెళతారని విశ్వాసముందన్నారు. రాజధానికోసం రైతులు చేసిన త్యాగాన్ని, రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ.. రై తులతో కలిసి మహిళలు, పిల్లలు వీధుల్లో చేస్తోన్ననిరసనను శాస్త్రి దేశ ప్రజల దృష్టికి తీసుకుపోతారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
అభివృద్ధి ప్రక్రియలో అమరావతి తన నిధులు తానే సమకూర్చుకుంటూ.. ప్రపంచంలో ఉత్తమ మోడల్ గా నిలుస్తుంది’ అని అన్నారు. వేలకొద్దీ రైతులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రాజధానికి 32,000 ఎకరాల భూములను సమకూర్చారు. వారి త్యాగం ‘ఒక రాష్ట్రం ఒక రాజధానికోసమే’ కానీ, మూడు రాజధానుల కోసం కాదన్నారు.
ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతాం: డీకే అరుణ