telugu navyamedia
రాజకీయ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లవ

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు (శుక్రవారం) 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నాయకులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలవారని, దేశానికి ఆయన జీవితం అంకితం చేశారని పేర్కొన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. చిరకాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

 

Related posts