telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణలో ఒకే రోజు 14 మందికి.. 59కి చేరిన కరోనా కేసుల సంఖ్య

karona

తెలంగాణలో నిన్న ఒక్క రోజే 14 కరోనా నిర్ధారిత కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 59కి చేరుకుంది. బాధితులందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నిన్న నమోదైన కేసుల్లో అమెరికా నుంచి వచ్చిన 76 ఏళ్ల వృద్ధుడు ఒకరు కాగా, ఓ వైద్యుడి తల్లి కూడా ఉన్నారు. మిగతా 12 మంది వివరాలు తెలియాల్సి ఉంది. వీరందరూ వేర్వేరు దేశాల నుంచి వచ్చిన వారు, వారితో కలిసి గడిపిన వారే కావడం గమనార్హం.

రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు బులెటిన్ విడుదల చేస్తూ వస్తున్న ఆరోగ్య శాఖ నిన్న మాత్రం ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం వైరస్‌ను ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. కరోనా వార్డుల్లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ఎన్ 95 మాస్కులు, అవసరమైన దుస్తులు, వస్తువులను కొనుగోలు చేసేందుకు సంసిద్దమైంది.

Related posts