telugu navyamedia
రాజకీయ

జాతీయ అవార్డుల సంప్రదాయం తప్పిందా ?

Bhageeradha Memories In National Awards
ప్రతిసంవత్సరం జాతీయ సినిమా అవార్డుల ప్రదానం మే 3వ తేదీన జరుగుతుంది ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తున్న సంప్రదాయం . అయితే ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల కోడ్ ఉన్నందున అవార్డుల ప్రదాన కార్యక్రమం వాయిదాపడింది . కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అవార్డుల ప్రదానం ఉంటుంది . భారత దేశంలో నిర్మించిన సినిమాలు జాతీయ అవార్డుల పోటీకి వస్తాయి . మొదట్లో ఒకే కమిటీ ఉండేది . 
నెల రోజులకు పైగా  జ్యూరీ సభ్యులు సినిమాలను చూసి ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసేవారు . అయితే క్రమంగా సినిమాలు సంఖ్య గణీయంగా పెరగడంతో కేంద్ర సమాచార శాఖ ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేసింది . నార్తర్న్ రీజియన్ లో భోజపురి ,ఢోగ్రి , ఇంగ్లీష్ ,హిందీ ,పంజాబీ , రాజస్థానీ , ఉర్దూ , ఈస్టర్న్ రీజియన్ లో అస్సామీ ,బెంగాలీ , 64వ జాతీయ అవార్డుల ప్రధాన  కార్యక్రమం న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో  కన్నుల పండుగగా జరిగింది జాతీయ అవార్డుల కమిటీ సభ్యుడిగా ఉండాలన్న నా కోరిక నెరవేరింది . ఒరియా , వెస్టర్న్ రీజియన్ లో గుజరాతి ,కొంకణి , మరాఠీ , సౌత్ రీజియన్ 1 లో మలయాళం ,తమిళం , సౌత్ రీజియన్ 2లో తెలుగు , కన్నడ , తుళు భాషా చిత్రాలను చూసి వాటి నుంచి 30 శాతం మాత్రమే ఎంపిక చెయ్యాలి . అలా ఎంపిక చేసిన సినిమాలను సెంట్రల్ కమిటీ చూసి ఉత్తమ సినిమాలు ,నటీనటులను ఎంపిక చేస్తారు .
Bhageeradha Memories In National Awards 
64వ జాతీయ అవార్డుల కమిటీలో నేను సభ్యుడుగా వున్నాను . నా అనుభవాన్ని తెలియజేస్తాను . మా ప్రాంతీయ కమిటీ సౌత్ రీజియన్ 2 కు అధ్యక్షుడు గా ఎస్ . సాయి వసంతన్ , సభ్యులుగా నేను , కె ఎస్ రమేష్ , హెచ్ .ఎన్ మారుతి , అస్లాం షేక్ వున్నాము . 23 రోజులపాటు ఢిల్లీ అశోక హోటల్ లో కేంద్ర ప్రభుత్వ అతిధిగా వున్నాను  విశేషమేమంటే చైర్మన్ కు మాత్రమే సూట్ రూమ్ ఇస్తారు . కానీ జ్యూరీ సభ్యుడుగా నాకు ఓ పెద్ద సూట్ కేటాయించారు . రోజుకు దాని రెంట్ 25,000 రూపాయలు .అశోక నుంచి ప్రతిరోజూ సిరిపొర్ట్ ఆడిటోరియం కు వెళ్లడం అక్కడ తెలుగు , కన్నడ , తుళు  సినిమాలు చూసి ప్రాధమికంగా కొన్ని చిత్రాలు ఎంపిక చేశాము . ఆ తరువాత సెంట్రల్ జ్యూరీ అన్ని కేటగిరి చిత్రాలను ఎంపిక చేసింది . 
ప్రతి సంవత్సరం మే 3వ తేదీన న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి విజేతలకు అవార్డులను అందిస్తారు . ఇది చాలా సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం . డైరెక్టర్ అఫ్ ఫిలిం ఫెస్టివల్స్ డిప్యూటీ డైరెక్టర్ ప్రశాంత్ అనుమతితో నేను అవార్డుల కార్య క్రమానికి నా భార్య ఝాన్సీ రాణిని కూడా తీసుకెళ్ళాను . జ్యూరీ సభ్యుడు ను కేంద్ర ప్రభుత్వ అతిధిగా భావిస్తారు . ప్రోటోకాల్ ప్రకారం ఆడిటోరియంలో సీట్లు కేటాయిస్తారు . జ్యూరీ సభ్యుల భార్యలకు మాత్రం ఆడిటోరియం లో వెనుక సీట్లు కేటాయిస్తారు . అలాగే అశోక హోటల్ లో కూడా జ్యూరీ సబ్యుడుకు మాత్రం వసతి కల్పిస్తారు . శ్రీమతి కి మాత్రం గెస్ట్ చార్జెస్ చెల్లించాలి. ఈ విషయాన్ని ప్రశాంత్ చాలా స్పష్టంగా చెప్పాడు. 
Bhageeradha Memories In National Awards
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు అవార్డులను ప్రదానం చెయ్యగా వారికి కేంద్ర సమాచార మంత్రి ఎమ్ .వెంకయ్య నాయుడు గారు , సహాయ మంత్రి రాజవర్ధన్ రాధోడ్ సహకరించారు . రాష్ట్రపతి అవార్డులను ప్రదానం చెయ్యడానికి ముందు సమాచార శాఖా మంత్రి వెంకయ్య నాయుడు  గారు మొదటిసారి జ్యూరీ సభ్యులకు సర్టిఫికెట్లను అందించారు . ఈ వేడుక విజ్ఞాన్ భవన్ లోని రెండవ అంతస్తులో జరిగింది . ఈ కార్యక్రమానికి ప్రశాంత్ నన్ను నాభార్యను  దగ్గరుండి తీసుకెళ్లాడు . లోపలకు వెళ్లిన తరువాత తెలిసింది . జ్యూరీ సభ్యులను తప్ప వారి భార్యలను అనుమతించలేదని ,నాకు ఆశ్చర్య మనిపించింది . ఆ తరువాత వెంకయ్య నాయుడు గారు జ్యూరీ సభ్యులకు టి పార్టీ ఇచ్చారు . 
ఆ తరువాత సరిగ్గా  సాయంత్రం 6. 00 అవార్డుల కార్యక్రమం ప్రారంభం అవుతుంది . ముందు నా భార్యను వెనుక సీట్లో కూర్చో పెట్టి వద్దామని వెడుతుంటే ప్రశాంత్ ఎదురయ్యాడు . “ముందుకు వెళ్ళండి , వెక్కకు ఎందుకు వెడుతున్నారు ?” అని అడిగాడు . “నా వైఫ్ ను కుర్చోపెడదామని వెడుతున్నా “అన్నాను . అప్పుడు ప్రక్కనే వున్నా తన అసిస్టెంట్ ను పిలిచి “సార్ ను తీసుకెళ్లి సీట్లు చూపించు “అన్నాడు నాకు అర్ధం కాలేదు . అయినా  అతని వెంట వెళ్ళాను . రెండవ వరుసలో మొదటి సీట్ టేబుల్ ముందు నాపేరు వుంది. రెండవ సీటు ముందు మిస్సెస్ భగీరథ అని వుంది . 
Bhageeradha Memories In National Awards
అంటే నా వైఫ్ ను కేంద్ర ప్రభత్వ అతిధిగా గుర్తించి సీట్ కేటాయించారు . అంతకు ముందు ఎప్పుడు ఎవరి భార్యలకు ఈ గౌరవం దక్కలేదు . ఇలా ఎందుకు జరిగిందో … దీనికి కారణం ఎవరో నాకు తెలుసు . వారికి మసులోనే కృతజ్ఞతలు తెలిపాను . నేను ఊహించని అద్భుతమైన , అనూహ్యమైన గౌరవం ఇది . అంతే కాదు  స్టార్ హోటల్ అశోకలో నా భార్య ఉన్నందుకు ఎంత చెల్లించాలో అనుకున్నాను . అక్కడ రూమ్ రెంట్ 15,000 రూపాయలు హోటల్ ఖాళి చేసేరోజు సాయంత్రం రిసెప్షన్లో అడిగాను ఎంత పే చెయ్యాలని , అతను కంప్యూటర్లో చెక్ చేసి .. “మేడం ఆల్సో ట్రీటెడ్ యాజ్ గవర్మెంట్ గెస్ట్ ” అని చెప్పాడు . 
Bhageeradha Memories In National Awards
నిజంగా ఇది నిజమేనా ? నేను నమ్మలేకపోయాను . అనూహ్యమైన సంగతి .  64వ జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యుడుగా నాకు దక్కిన అపూర్వమైన గౌరవం . ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి . 
-భగీరథ 

Related posts