కాలిఫోర్నియాను కార్చిచ్చు చుట్టిముట్టింది. దీనితో విపరీతమైన వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటకు 137 కిలోమీటర్ల వేగంతో వేడిగాలులు వీస్తున్నాయి. విపరీతమైన వేడిగాలులకు అగ్గి రాజుకొని వృక్ష సంపదనంతా కబలించేస్తుంది. ఇప్పటి వరకు 23,700 ఎకరాల వృక్ష సంపద అగ్నికీలల్లో చిక్కుకున్నదని అధికారులు తెలిపారు.
అప్రమత్తమైన అధికారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలార్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.