telugu navyamedia
రాజకీయ

పంజాబ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఆధిక్యం

*మ్యాజిక్ ఫిగ‌ర్ దాటేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ
*చీపురు ప‌ట్టుకుని కార్య‌క‌ర్త‌లు నృత్యాలు..
*ఢిల్లీలో ఆఫ్‌ కార్యాల‌యం వ‌ద్ద ఆమ్‌ఆద్మీ పార్టీ సంబ‌రాలు..

5 రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి.

పంజాబ్‌లో హేమాహేమీలకు షాకిచ్చిన ఆప్. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుదిశగా ఆప్. కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి చన్నీ రెండుచోట్ల వెనుకంజ.

పంజాబ్‌లో 117 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ముందంజ‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఉన్నారు. ప్రస్తుతం 84 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మన్ గెలుపు దిశగా పరిగెడుతున్నరు.

కాంగ్రెస్ 18, శిరోమణి అకాళీదళ్‌ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీజేపీ కేవలం 4 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. కాంగ్రెస్‌ పంజాబ్‌ చీఫ్‌ సిద్ధూపై ఆప్‌ అభ్యర్థి ముందంజలో ఉండడం విశేషం.

అయితే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మాత్రం అధికార కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని, ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని అంచనావేస్తుంది.

 

Related posts