telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జైల్లో కూడా .. రాజభోగాలతో .. శశికళ ..

sasikala with luxury arrangements in jail

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు పరపన అగ్రహారం జైలులో విలాసవంతమైన సదుపాయాలు కల్పించిన మాట వాస్తవమేనని విచారణ కమిటీ నిర్ధారించింది. అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు శశికళకు నాలుగేళ్ల జైలు విధించడంతో, గత రెండేళ్లకు పైగా పరపన అగ్రహారం జైలులో శశికళ శిక్షను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప పరపన అగ్రహారం జైలులో శశికళకు ప్రత్యేకంగా ఐదు గదులు, విలాసవంతమైన పరుపులు, వంటగది తదితర సదుపాయాలు కల్పించి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. జైలులో ఈ సదుపాయాలు పొందటానికి అధికారులకు శశికళ రెండు కోట్లకు పైగా ముడుపులు చెల్లించారని కూడా రూప విచారణలో కనుగొన్నారు. ఇంకా శశికళ చుడీదార్‌ ధరించి జైలు నుంచి బయటకు వెళ్ళి బెంగళూరు నగరంలో షాపింగ్‌ చేసుకుని తిరిగి వస్తున్న వీడియో ను కూడా విడుదల చేశారు. శశికళకు జైలులో కల్పించిన సదుపాయాలు గురించి, ఆ సదుపాయాలు కల్పించేందుకు ముడు పులు తీసుకున్న అధికారుల గురించి సమగ్రమైన నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పిం చారు.

ఈ ఆరోపణలపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వినయ్‌కుమార్‌ నాయకత్వంలో ఓ విచారణ కమిటీని కర్నాటక ప్రభు త్వం నియమించింది. వినయ్‌కుమార్‌ కమిటీ విచారణ జరిపి ఇటీవలే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో శశికళకు విలాసవంతమైన సదుపాయాలు కల్పించడం వాస్తవ మేనంటూ ఆధారాలతో సహా ప్రకటించింది. శశికళ సదుపాయాల కోసం అప్పటి జైలు అధికారి సత్యనారా యణకు రూ.2 కోట్లకు పైగా ముడుపులు ఇచ్చారని కూడా ఆ కమిటీ నిర్ధారిం చింది. దీనితో శశికళకు జైలు శిక్ష పొడిగించే అవకాశ ముందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బుధవారం పరపన అగ్రహారం జైలులో బెంగ ళూరు నగర క్రైం విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ సందీ ప్‌ పాటిల్‌ నాయకత్వంలో పోలీసులు ఆకస్మిక తనిఖీ లు జరిపారు. ఈ తనిఖీలలో కొంతమంది ఖైదీల వద్ద నుంచి గంజాయి, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకు న్నారు. శశికళ గదిలోనూ ఈ తనిఖీలు జరిగాయి.

Related posts