ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికార బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఆధిక్యాల విషయంలో బీజేపీ 200 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. దీంతో అప్పుడే యూపీలో బీజేపీ శ్రేణుల సంబరాలు మొదలైపోయాయి.
ఇందులో గోరఖ్ పూర్‌లో అర్బన్ స్థానంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముందంజలో కొనసాగుతున్నారు. జశ్వంత్‌నగర్ స్థానంలో శివపాల్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు.. మెయిన్‌పురి స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ లీడ్‌లో దూసుకెళ్తున్నారు.
టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుంది: కన్నా