telugu navyamedia
రాజకీయ వార్తలు

భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు చీకటి దినం: మాజీ సీఎం ముఫ్తీ

mehbooba kashmir

భారత ప్రజాస్వామ్యంలో ఈరోజు అత్యంత చీకటి దినమని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. కేంద్రం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఎ లను రద్దు చేయడంపై ఆమె ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. జమ్మూకశ్మీర్ నాయకత్వం 1947లో రెండు జాతులు-రెండు దేశాల సిద్ధాంతాన్ని వ్యతిరేకించి భారత్ తో చేతులు కలిపింది. కానీ ఆ నిర్ణయం ఈరోజు కశ్మీరీల పాలిట శాపంగా మారింది.

ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగవిరుద్ధమే. దీనివల్ల భారత్ జమ్మూకశ్మీర్ లో దురాక్రమణదారుగా మారుతుంది. దీనివల్ల భారత ఉపఖండంలో తీవ్రమైన దుష్పరిణామాలు సంభవిస్తాయి. జమ్మూకశ్మీర్ ప్రజలను భయపెట్టి రాష్ట్ర భూభాగాన్ని లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కశ్మీర్ కు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో భారత్ ఘోరంగా విఫలమైందని ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

Related posts