తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో గవర్నర్ నగర వాసులకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ బోనాలు ఎంతో చారిత్రకమైనవని, ఈజాతరలో జంటనగరాల వాసులే కాకుండా తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని పేర్కొన్నారు. కానీ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా బోనాల జాతరకు బ్రేక్‌పడిందన్నారు.
1869లో మలేరియా ప్రబలి చూస్తుండగానే వేలాది మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. ప్రకృతి మాతను శాంతింపచేయడానికి ఉత్సవాలు, జాతరలు జరిపారని ఆయన గుర్తుచేసుకున్నారు.ఇక బోనాల జాతరలో వేలాది మంది మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారిని కొలుస్తూ తమ భక్తిని చాటుకుంటారని అన్నారు. గత 40సంవత్సరాలుగా కుటుంబ సమేతంగా ఉజ్జయిని మహాకాళిని దర్శించుకుంటానని పేర్కొన్నారు.